TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 25 : గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర అన్నారు. ఈ మేరకు సోమవారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండలంలో ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. జన్మన్ పివి టిజి పథకం గృహాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ సరిపోవడం లేదని తక్షణం 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తేనే ఇల్లు పూర్తవుతాయని తెలిపారు.

మిగిలిన గిరిజనులకు కూడా తక్షణం 10 లక్షల రూపాయలతో ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం ఏమైందని ప్రశ్నించారు సంక్షేమ పథకాలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గిరిజన ప్రాంతంలో విస్తారంగా మిరియాలు కాఫీ వస్తున్న గిరిజనులు దళారి చేతిలో మోసపోతున్నారని తక్షణం జిసిసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిరియాలు రైతులకు గిట్టుబాటుతోపాటు, ఉచితంగా నిచ్చెనలు, పల్పింగ్ మిషన్ లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ మాడగడ, బస్కి, సుంకరమెట్ట పంచాయితీల్లో జరుగుతున్న రోడ్లు పనులు ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో అర్థవంతంగా ఆగిపోయని తెలిపారు. తక్షణం ఆ రోడ్లు పున ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెద్దలబుడు పంచాయతీలో నువ్వు కూడా, లింబగూడా గ్రామాల సాగు చేస్తున్న రైతులకు జిరాయితీ పట్టాలు తక్షణం మంజూరు చేయాలని తెలిపారు. మండలంలో 900 పొడు పట్టాలు ఇవ్వాల్సి ఉందని నేటికీ అందలేదని అన్నారు. సుంకరి మెట్ట, చిన్న లబ్బుడు, పెద్దలబుడు పంచాయితీలో చెక్ డం మరమ్మతులు చేయాలని అదేవిధంగా చొంపి పంచాయతీ. పెద్ద చెరువును పూడిక తీయించి సాగు పొలాలకు అందుబాటులో తేవాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు గిరిజన సంఘం కార్యాలయం నుండి ప్రదర్శనగా ఎంపీడీవో కార్యాలయం వరకు వెళ్లి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ముట్టడి చేశారు. అధికారులని సమస్యలపై నిలదీశారు అనంతరం ఎంపీడీవో లవ రాజు కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిపిఎం మండల నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వివి జయ, మండల కార్యవర్గ సభ్యులు పి.బాలదేవ్, గత్తుం బుజ్జిబాబు , మగ్గన్న, జగన్నాథం , రామన్న ,సుంకరమెట్ట సర్పంచ్ గెమిలి చిన్నబాబు, పద్మాపురం ఉపసర్పంచ్ జన్ని భగత్ రాం, జోషి, నాని బాబు, ఐస్ బాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.ap

Trinethram news
Download App

CPM demands provision of