CPM Bus Yatra is going on in Ramagundam demanding coal blocks to be given to Singareni
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని మున్సిపల్ చౌరస్తా వద్ద బస్సు యాత్ర బృందం అంబేద్కర్ గారికి పూలమాల వేసి బైక్ ర్యాలీగా మైన్స్ పై గేట్ మీటింగ్లకు బయలుదేరింది,
ఈరోజు రామగుండం1, ఏరియాలో సింగరేణి పరిరక్షణ పేరుతో సిపిఐఎం ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు యాత్ర ఈరోజు గోదావరిఖనికి చేరుకోవడం జరిగింది.
బస్సు యాత్రలో పాల్గొంటున్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులైన ఎస్ వీరయ్య భూపాల్ మరియు ఆసాలు గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలో అంబేద్కర్ గారికి పూలమాలవేసి, అక్కడినుండి బైక్ ర్యాలీతో బస్సుయాత్ర బృందం బయలుదేరి, Gdk-2 ఇంక్లైన్ 7:00 గంటలకు ఏరియా వర్క్ షాప్ లో 9 గంటలకు, కార్మికులను కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు అనంతరం జరిగిన గేటు మీటింగ్లో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా ఉండి కూడా సింగరేణిని భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని కేవలం వారు సింగరేణి ద్వారా వచ్చే డివిడెంట్ అనే లాభాలను తీసుకోవడంలో చూపే శ్రద్ధ కొత్త బొగ్గు బ్లాక్ లను కేటాయించి భవిష్యత్తును కాపాడి మరి కొంతమందికి ఉపాధిని కల్పించాలని దృష్టితో చూడడం లేదని విమర్శించారు నేడు అసెంబ్లీలో కూడా సింగరేణిపై చర్చించడానికి సైతం వెనుకడుగు వేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సింగరేణిపై ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తుందని అందుకని వెంటనే బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ బిజెపిల వైఖరి తెలుస్తుందని అన్నారు మరోవైపు గత ప్రభుత్వం బకాయిలను వాడుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ ఆ బకాయిలను ఇప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని కార్మికులకు ఇచ్చిన హామీలైన అలవెన్స్ లపై ఐటి మాఫీ మారు పేర్లు పథకాలను ఇప్పటివరకు అమలు చేయలేదని కనీసం ఇప్పటివరకు లాభాలు సంస్థ ఎందుకు ప్రకటించడం లేదని అడగలేని స్థితిలో ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు మరోవైపు సింగరేణి నిధులను వాడుకోవడంలో చూపుతున్న కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు చూపుతున్న శ్రద్ధ గనులలో ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం యాజమాన్యాన్ని ప్రశ్నించడం కానీ ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం గాని చేయడం లేదన్నారు ఇప్పటికే ఎన్నికలు నిర్వహించి ఆరు నెలలు దాటిన కూడా గెలిచిన సంఘానికి యాజమాన్యం గుర్తింపు పత్రం ఇవ్వలేదని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని రెండు సంవత్సరాలకు గుర్తింపు పత్రం ఇచ్చి కార్మిక సమస్యలపై స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కార్మికుల్లో ప్రజలలో చెడ్డపేరు తీసుకురావాలని సింగరేణి కార్మికులకు సరైన ఆసుపత్రి సౌకర్యాలు క్వాటర్లలో కనీస సౌకర్యాలైన రోడ్డు డ్రైనేజీ మంచినీరు వంటి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడం లేదని ఏదో పైపైన పరిష్కరిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పి రాజారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సిపిఎం పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య కార్యదర్శి వర్గ సభ్యులు ఏ ముత్యం రావు, ఏ మహేశ్వరి, వి కుమారస్వామి, ఎం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు, మెండె శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, ఎస్కే గౌస్, దాసరి సురేష్, సానం రవి, వంగల రాములు, పి శ్రీనివాసరావు, ఏ శంకరన్న, పి సమ్మయ్య, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, గోళం సాయి కృష్ణ, ఈ సాగర్, శశికిరణ్, పి శ్రీనివాస్, జనార్ధన్, బైక్ ర్యాలీలో 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App