
ఖాళీగా ఉన్న మున్సిపాలిటీ స్థలాలలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి
మున్సిపాలిటీ స్థలాలపై భూకబ్జాదారుల కన్ను
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శ
Trinethram News : రాజమహేంద్రవరం ఏప్రిల్ 7 : రాజమండ్రి నగర పరిధిలో కొన్ని ప్రాంతాలలో మున్సిపాలిటీకి చెందిన స్థలాలు ఖాళీగా ఉన్నాయని వాటిపై భూ కబ్జాదారుల కన్ను పడుతుందని వెంటనే ప్రభుత్వం ఆలోచించి ఖాళీగా ఉన్న స్థలాలలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక సిపిఐ కార్యాలయంలో నగర శాఖా కార్యదర్శుల సమావేశం యూనియన్ అధ్యక్షులు కూo డ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ కొంతమంది భూకబ్జాదారులు నగరంలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీ దేవాదాయ స్థలాలపై కన్ను పడిందని వాటిని ఏదో రూపంలో దక్కించుకోవడం కోసం అమరావతి వేదికగా ప్రయత్నాలు మొదలు పెట్టారని
ఈ నేపథ్యంలో నూతన కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చింది కాబట్టి వెంటనే ఆ స్థలాలలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రెండు సెంట్లు చొప్పున పంపిణీ చేయాలన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తీసుకుని ఆవ దేవాదాయ భూమైన దాని కోర్టులో వేసి వేలాదిమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు దూరదృష్టంతో ఆలోచించి పేదలకు మున్సిపాలిటీ స్థలాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అక్కడ కాకుండా ఎక్కడో సుదీర ఇస్తే పట్టణాలకు పనులకు రాలేరని అందుకే నగరంలో ఉన్న స్థలాలు కేటాయించాలని మధు కోరారు
పార్టీ నగర కార్యదర్శి వి కొండలరావు కార్యక్రమాల రిపోర్ట్ను భవిష్యత్ కర్తవ్యాలను ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు ఇంకా ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, నగర కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్ కే శ్రీనివాస్, పి లావణ్య, పి త్రిమూర్తులు, టీ నాగేశ్వరరావు, నల్ల రామారావు, శాఖా కార్యదర్శులు వానపల్లి సూర్యనారాయణ, కే కొండావతి, రమణ, రామరాజు నాగబాబు, అల్లం వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
