
జిల్లా మంత్రి వర్యులు దీనిపై దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి రెండు జిల్లాల ప్రజలకు, వాహాన దారులకు సౌకర్యం కల్పించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రినేత్రం ప్రతినిధి
అక్రమ టోల్ గేట్ ను తొలగించి వాహాన దారులకు ఆర్థిక దోపిడీ నుండి విముక్తి కల్పించిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు వంతెన నిర్మాణం చేపట్టే వరకు వాగులో తాత్కాలిక బి.టి రోడ్డు వేయాలి సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్ డిమాండ్ పెద్దపల్లి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య ఓడేడ్, గర్మిళ్ళపల్లి మధ్యలో మానేర్ వాగు పై బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు జిల్లాల ప్రజలకు వాహాన దారులకు సౌకర్యం కొరకు ప్రారంభమైన వంతెన నిర్మాణం పూర్తి కాకుండానే గత ఏడాది వర్షాకాలంలో కూలీపోయిందని, కూలీ పోయిన వంతెన ను పునః నిర్మాణం చేపట్టే విధంగా జిల్లా మంత్రి వర్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
నిర్మాణం లో ఉన్న వంతెన కూలి పోవడం వల్ల రెండు జిల్లాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటివలే మానేరు కొంత మంది వ్యక్తులు అక్రమంగా ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను జిల్లా కలెక్టర్ తొలగించడం ప్రజలు, వాహాన దారులకు ఆర్థిక దోపిడీ నుండి విముక్తి కల్పించడాన్ని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి వంతెనను పునః నిర్మాణం చేసేవరకు వాగులో తాత్కాలిక బి.టి రోడ్డు ను వేసి రెండు జిల్లాల ప్రజలకు వాహాన దారులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిన బ్రిడ్జిని పునః నిర్మాణం చేపట్టాలని ఆయన ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
