TRINETHRAM NEWS

CPI ML Mass Line Praja Pantha Karimnagar Joint District Committee

చత్తీస్ ఘడ్ లో ఎన్కౌంటర్ పేరిట 36 మందిని కాల్చి చంపిన మృత్యు కాండను ఖండించండి.

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాష్ట్ర, కేంద్ర పోలీస్ లు 32 మంది కి పైగా మావోయిస్టు పార్టీ వారిని కాల్చి చంపడాన్ని సి.పి.ఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ఖండిస్తున్నది. నారాయణ పూర్ దంతెవాడ సరిహద్దు నేందురు తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయినట్లు
సమాచారం తో కుంబింగ్ చేసి ఎన్కౌంటర్ తో కాల్చేశారు. ఇది దుర్మార్గపు చర్య.
హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్లు కగార్ ఆపరేషన్ ఎన్కౌంటర్ గా స్వస్టమౌతున్నది. ఈ మధ్యకాలంలో 180 పైగా మృతువాతపడ్డారు. చట్ట ప్రకారంగా అరెస్టుచేయడానికి బదులు విచారణ ద్వారా శిక్షించడానికి బదులు చంపి వేయడం చట్ట వ్యతిరే రాజ్యాంగ వ్యతిరేక చర్యక భావిస్తున్నాం.
ఈ విధానాన్ని మాను కోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాం. చట్ట వ్యతిరేక చర్యలకు చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప ఇలా రాజ్యం మూకుమ్మడి హత్యాకాండ కు పూనుకోవడం దుర్మార్గ చర్య గా కాదని స్పష్టం చేస్తున్నాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App