CP who visited Srirampur Police Station
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బాధితులకు పోలీస్ అండగా ఉంటూ, సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలి
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ వచ్చిన సిపి ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ మోహన్, అధికారులు మొక్కలను అందించి ఆహ్వాన పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, మైన్స్, ముఖ్య మైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తారనే నమ్మకం భరోసా కలిగించే విధంగా ప్రవర్తించాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్రీ, ఫెయిర్ మరియు ప్రశాంతంగా ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాలు, ఎన్నికలు ఓటింగ్ ప్రక్రియ, తర్వాత కౌంటింగ్ నిర్వహించడం జరిగిందని, ఇప్పటి నుంచి సాధారణ విధులపై దృష్టి పెట్టడంలో భాగంగా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేరాలకు సంబంధించిన వివరాలు, లా అండ్ ఆర్డర్ సమస్యల పై, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
జూలై 1 -2024 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు – 2024 భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమలు అవుతున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు.
దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించేలా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అని,పోలీస్ స్టేషన్ పరిధిలో విసబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని ఆదేశాలు జారి చేయడం జరిగిందని రామగుండం కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) తెలిపారు.
ఈ కార్యక్రమం లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , శ్రీరాంపూర్ సీఐ మోహన్ , శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, ప్రసన్న లు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App