TRINETHRAM NEWS

CP visited problem villages under Jannaram Police Station

ప్రజలందరూ సంయమనం పాటించాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లు, వదంతులు నమ్మవద్దు పోలీస్ కమీషనర్ ఏం. శ్రీనివాస్ ఐపిఎస్.,

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యత్మక గ్రామాలను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., జైనూర్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కమీషనరేట్ పరిధిలో ఆదివాసీ గూడాలు కలవు. ఎక్కడ ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు భాగంగా కవ్వాల్, లోతోర్రే, దేవుని గూడా, కిష్టా పూర్ గ్రామాలను సందర్శించి ప్రజలు యువత మరియు గ్రామ పెద్దలతో, ఆదివాసీ సంఘాల నాయకులతో మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు.

ఏదైనా సమస్య ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని కమిషన్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలా కాకుండా ధర్నాలు రాస్తారోకోలు కి పాల్పడడం చట్టాన్ని చేతిలోకి తీసుకొని గొడవలకు అల్లర్లకు పాల్పడడం చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులు నమ్మవద్దని సూచించారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో జైనూర్ ఉందని తెలిపారు. సోషల్ మీడియా నందు వదంతులను వ్యాప్తి చేసే వారిపై మరియు గ్రూప్ అడ్మిన్ లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇప్పటివరకు ప్రజలందరూ పోలీసు వారికి సహకరిస్తున్నారని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహకరించాలని కోరారు.

సిపి వెంట ఆర్ఐ లు సంపత్, వామన మూర్తి, ఎస్ఐ జన్నారం రాజవర్ధన్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CP visited problem villages under Jannaram Police Station