CP Task Force Police seized banned (BT-3) fake cotton seeds
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
(ఇద్దరు నిందితుల అరెస్ట్)
60 కిలోల నకిలీ విత్తనాలు, స్వాదీనం
కల్తీ, నకిలీ విత్తనాల రూపుమాపి రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు, రైతులను నట్టేట ముంచుతున్న నకీల విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకరావడం, సమూలంగా నిర్మలించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపిఎం టాస్క్‌ల బృందాలు, స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయడం జరుగుతుంది.
నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ , ఎస్సై లచ్చన్న, సిబ్బందితో కలిసి మంచిర్యాల జోన్‌లోని హాజీపూర్ స్టేషన్ పరిధిలోని ముల్కల వద్ద జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి మంచిర్యాల వైపు TS19 B 7434) HERO HF DELUX బైక్ పై వస్తున్న ఇద్దరు రెండు అనుమానిత సంచులతో వస్తున్న ఆపి రెండు సంచులను తనిఖి చేయగా సుమారు లక్షా ఎనభై వేల (1,80,000/-) రూపాయల విలువైన 60 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగింది.
అనంతరం వారిని విచారించగా వారి పేర్లు గుండవేని రాజశేఖర్, ముచ్చెర్ల సంపత్ అని అట్టి పత్తి విత్తనాలు జగిత్యాల జిల్లా కోరుట్ల కి చెందిన షాబుద్ధిన్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి మంచిర్యాల ప్రాంతంలోని అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకువెళుతున్నామని తెలపడం జరిగింది.
(నిండితుల వివరాలు)
గుండవేణి రాజశేఖర్ S/o. ఇలయ్య
వయస్సు: 28, గొల్ల,Occ: కూలీ
R/o.2-64, కాసిపేట తుంగగూడెం
ముచ్చెర్ల సంపత్ S/o. చంద్రయ్య
వయస్సు:27, యాదవ్, Occ: కూలీ
R/o. సెల్ టవర్ దగ్గర, తుర్పు వాడ, దర్మారావుపేట, కాసిపేట.
తదుపరి విచారణ నిమిత్తం నిందితులు నకిలీ గింజలను సరఫరా చేయడానికి ఉపయోగించే బైక్ మరియు నకిలీ (BT) పత్తి విత్తనాలను స్వాదీన పర్చుకొని వాటిని మరియు నిందితులను హజీపూర్ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App