TRINETHRAM NEWS

CP Task Force Police seized banned (BT-3) fake cotton seeds

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కల్తి, నకిలీ విత్తనాల రూపుమాపి రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు, ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టేట ముంచుతున్న నకీల విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకరావడం, సమూలంగా నిర్ములించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పని చేయడం జరుగుతుందని దానిలో బాగంగా కర్ణాటక నుండి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి, రామగుండం పోలీస్ కమీషనరెట్ మీదుగా కొంతమంది నిషేధిత (బిటి-3) నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ , ఎస్సై లచ్చన్న, సిబ్బంది లతో కలిసి మంచిర్యాల జోన్ లోని చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ ను ఆపి వారిని తనిఖీ చేయగా వ్యాన్ వాహనం లో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమారు 16,50,000/- విలువైన 5.5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగింది. అనంతరం వారిని విచారించగ వారి పేర్లు సొల్లు పెద్దయ్య, సొల్లు హరి కుమార్ అని అట్టి పత్తి విత్తనాలు సుబ్బారావు, గుంటూరు అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకువెళ్తున్నానని తెలిపారు . ఇట్టి వ్యక్తులపై U/Sec 420 r/w 34 IPC, Sec.19 of seeds Act. Sec 15(1) Environment Protection Act ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.
నిందితుల వివరాలు
1) సొల్లు పెద్దయ్య @ సురేష్ s/o గురువయ్య, వయస్సు : 36 సంవత్సరాలు, కులం : SC మాల, Occ : DCM వ్యాన్ ఓనర్ మరియు డ్రైవర్, కొత్తూరు గ్రామం, లక్షేట్టిపేట్ మండలం R/o మంచిర్యాల జిల్లా
2) సొల్లు హరి కుమార్ s/o లచ్చన్న , వయస్సు: 26, కులం: Sc మాల, occ: DCM వాన్ క్లీనర్,
స్వాధీన చేసుకొన్న వాటి వివరాలు
5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, 180000/- నగదు,
3 mobile phones,
ఐచర్ వ్యాన్ B. No. TS 19T 3447
తదుపరి విచారణ నిమిత్తం నిందితులు నకిలీ పత్తి గింజలను సరఫరా చేయడానికి ఉపయోగించిన ఐచ్చర్ వ్యాన్ ను మరియు నకిలీ (BT) పత్తి విత్తనాలను స్వాదీన పర్చుకొని, స్వాదిన పర్చుకున్న వాటిని మరియు నిందితులను చెన్నూర్ పోలీస్ అప్పగించడం జరిగింది
నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు సిబ్బందికి సీపీ రివార్డ్ లు అందజేయడం జరిగింది
ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, చిన్ను అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CP Task Force Police seized banned (BT-3) fake cotton seeds