TRINETHRAM NEWS

నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవనాలను పరిశీలించిన సీపీ

త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ ల ప్రారంభోత్సవం

పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలో నూతనంగా మహిళ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు కు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం జి ఓ ను కూడా విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా నూతన పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు కు భవనాలు, స్థలాలు ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి, పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., ఇతర అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పెద్దపల్లి మహిళ పోలీస్ స్టేషన్ కోసం వ్యవసాయ మార్కెట్ లో, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కోసం బంధం పల్లి లో ప్రాథమిక పాఠశాల భవనం ప్రతిపదించడం జరిగింది, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కొనసాగుతున్న భవనం అదేవిదంగా ఎలిగేడు పోలీస్ స్టేషన్ కోసం పాత ఎం. ఆర్ వో కార్యాలయం లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అట్టి భవనాలు పోలీస్ స్టేషన్ లకు అనుగుణంగా మార్పులు చేస్తూ, పునరుద్దరణ పనులు చేయడం జరుగుతుంది దానికి సంబందించి పనులు పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఆదేశాలు జారీ చేయడం కోసం సందర్శించడం జరిగింది అని సీపీ తెలిపారు.

ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్ఐ లు లక్ష్మణ్ రావు, జూలపల్లి ఎస్ఐ సనత్ కుమార్, సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App