Corporator Venkatesh Goud : సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి నవంబర్ 13 (త్రినేత్రం న్యూస్) : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ ఫేస్ 1 లో సాయి కల్యాణ మండపం వెనుకవైపు సుమారు ఇరవైఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్విన్ కాలనీ ఫేస్ 1 లో కొంతమేర పెండింగ్ ఉన్న సీసీ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియచేసారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, బి.వెంకటేష్ గౌడ్, రఘు, నరసింగరావు, కృష్ణయ్య, ఖాదీర్, ఇజాక్, గోపీచంద్, నాగేశ్వరరావు, కాలనీ వాసులు ఎ.ఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Corporator Venkatesh Goud inspects CC road construction work

You cannot copy content of this page

Scroll to Top