WhatsApp Image 2024 03 06 at 11.16.33
ఎస్కార్ట్ వాహనం ఆటోని ఢీకొనడంతో ఒకరు మృత్యువాత
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఘటన
మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం
శివ శంకర్. చలువాది
ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ కీలక నేత ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఎస్కార్ట్ వాహనం అటుగా వెళ్తున్న ఒక ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా మృతి చెందిన వ్యక్తిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయిల్‌గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి సురేశ్ ముందు వాహనంలో ఉన్నారు. మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
