TRINETHRAM NEWS

పెనుమూరు అభివృద్ధికి సహకరించండి.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. పెనుమూరు పంచాయతీని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టిడిపి అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో గత పాలకుల పాపాల వల్ల పెనుమూరు మండల కేంద్రంలో ఏడాదికి కోటి రూపాయలు పైగా ఆదాయం ఆగిపోయిందని విమర్శించారు. చార్వాకానిపల్లి పంచాయతీని పెనుమూరు పంచాయతీలో విలీనం చేయాలని అనుకున్నారు. విలీనం కాకపోవడం వల్ల పంచాయతీ ఎన్నికలు ఆగిపోయాయి. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందువల్ల కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే వల్ల ఎన్నికలు ఆగిపోవడం తో 15వ ఆర్థిక కమిషన్ నిధులు ఆగిపోయాయి. అలాగే బస్టాండ్ కాంప్లెక్స్ మరియు సంత గేటు వేలం వేయాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App