
Constables Backbone : విజయనగరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్సే వెన్నుముక అని అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యురాలు, హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో 2025 – 26 బ్యాచ్ కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆమె పాల్గొన్నారు.
పోలీస్ యూనిఫామ్ ప్రజలకు భరోసా కల్పించేలా విధులు నిర్వహించాలని సూచించారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని వాళ్లకు వివరించారు. ప్రజల రక్షణ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని స్పష్టం చేశారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వాళ్లకు అవార్డులు అందజేశారు.

స్టైలిష్ లుక్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్! సరికొత్త ‘Burgundy’ కలర్లో iPhone 18 Pro (512 GB)