
తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం..
ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నాం..
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా పెద్దపల్లి మండలం పాలితం, కాసులపల్లి, అప్పన్నపేట, అందుగులపల్లి, రాఘవపూర్, రంగాపూర్, గౌరెడ్డిపేట, గుర్రాంపల్లి గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ పేదల ఆకలి గోస తీర్చేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చౌక ధరల దుకాణలలో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. పేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్థామని తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. గత వానాకాలం నుండి సన్నవడ్లకు రైతులకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా ఇక నుంచి మేలురకం సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
దీనికీ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నుంచి పేదలకు సన్న బియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 55 రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా జరుగుతుందని, అవసరమైతే అదనపు షాపులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో ప్రజలకు రేషన్ ద్వారా దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా చేశారని, దీని వల్ల చాలా వరకు రీసైక్లింగ్ జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి రూ. 2 వేల 700 కోట్లు భరిస్తూ పేదల కోసం సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణ మాఫీ, సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించిన ఘనత రాష్ట్ర సర్కార్ కే దక్కిందన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో 59 కోట్ల 62 లక్షల రూపాయలను రైతు ఖాతాలలో బోనస్ క్రింద జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలందరికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. రానున్న నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గంలో దాదాపు 15 వేలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ది ప్రజాపాలన చూసి ఓర్వలేక కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ సన్న బియ్యం పంపిణీ చేసిందా అని ప్రశ్నించారు
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప వైస్ చర్మన్ కూర మల్ల రెడ్డి, నూగిళ్ల మల్లయ్య, సింగల్ విండో చెర్మన్ చింతపండు సంపత్,సందవేణి రాజేందర్, అరె సంతూష్, ఏడల్లి శెంకర్, వెల్చాలా రాజయ్య, మండల సత్యనారాయణ రెడ్డి,ఆడెపు వెంకటేష్, గంట రామేశ్, కొమ్ము శ్రీనివాస్,సునీల్ గౌడ్, ముత్యాల నరేష్, అనిల్ యాదవ్, జెడల రాజు, బొక్కల సంతోష్,గౌస్,కొమ్ము కర్నూకర్,అభిలాష్, సుధాకర్ రెడ్డి,రాకేష్, లక్స్మణ్, మహేందర్, అశోక్ నరేందర్, శ్రీనివాస్, మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
