
Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 7 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తుందని వీటి ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ ఇంచార్జ్ ఉజ్మా షకీలా పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన జై బాపు ,జై భీమ్, జైసంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యకర్తలను సమాయత్తం చేసే ఉద్దేశంతో సోమవారం బాలానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉస్మా షకీలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని ప్రజల ఆకాంక్ష మేరకు పాలన కొనసాగిస్తుందని అన్నారు.పార్టీ ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ లక్ష్యాలను నెరవేర్చాలని ఆమె కార్యకర్తలకు ఉద్బోధించారు.
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ అందరికి అండగా ఉంటుందని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానన్నారు.కాంగ్రెస్ హయాంలోని జల ప్రాజెక్టులు పరిశ్రమలు వచ్చాయని అప్పుడే అభివృద్ధి జరిగిందన్నారు.ప్రతి కార్యకర్త నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని లీడర్లుగా ఎదగాలని ప్రజా సమస్యల పరిష్కారంలో వారికి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.అధికారులతో సానుకూలంగా ఉండి ప్రజా పనులు చేయించుకోవాలన్నారు. జై భీమ్ జై బాబు జై భీమ్ జై సమ్మిదాన్ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కెపిహెచ్బి కాలనీ మొదటి రోడ్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమవుతుందని దీనికి కార్యక్రమం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇన్చార్జి ఉస్మా పార్టీ ఉన్నత స్థాయి నాయకులు హాజరవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన కిట్ ను ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ఏ బి బ్లాక్ అద్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి, తూము వేణు ,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జ్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, దండుగుల యాదగిరి ,కర్క పెంటయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి, రాఘవేందర్, లక్ష్మయ్య, సంజీవరావు మరియు డివిజన్ అధ్యక్షులు మరియు బ్లాక్ అధ్యక్షరాలు, మరియు మహిళా అధ్యక్షురాలు, యూత్ నాయకులు, ఎన్ ఎస్ యు యూత్ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
