TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారత్ జూడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న బలహీన వర్గాల ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసిన రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే అంశాన్ని నిన్న అసెంబ్లీలో తీర్మానించడం సంతోషదాయకమని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు బీసీ వర్గాల గొంతుక రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలియజేశారు*

దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానించడం సంతోషదాయకమని మిగతా వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తదని ప్రతి ఒక్క వర్గానికి బహుజన అందరికి అండగా కాంగ్రెస్ పార్టీ నిరుస్తుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృశ్య సారించి అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను పార్లమెంటులో ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు
బలహీనవర్గాలకు అండగా అనునిత్యం నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఒక్కొక్క హామీని నెరవేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ్యులకు పార్టీ నాయకత్వానికి బీసీ వర్గాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party town president