
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలోని కమలాపురం పంచాయతీలో కమలాపురం ఆశ్రమ హాస్టల్ లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆశ్రమ హాస్టల్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందని వార్డెన్ తో మాట్లాడి కాలిపోయిన హాస్టల్ గదులని పరిశీలించి వార్డెన్ తెలిపిన వివరాల ప్రకారం కాలిపోయిన కరెంట్ వైరింగ్ పరుపులు పెయింట్స్ నష్టం జరిగింది.
అయితే ఈ విషయాన్ని గౌరవ ఎంఎల్ఏ జారే ఆదినారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి పనులను వీలైనంత తొందరగా చేపిస్తామని తెలిపిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాలకుర్తి సమిత్ మరియు హాస్టల్ యాజమాన్యం మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
