TRINETHRAM NEWS

అరకువేలి లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు.

ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ టౌన్) త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 10 :

ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు రాజ్య సభ సభ్యురాలు, సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి.ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు, ఈ సందర్భంగా పాచిపెంట శాంతకుమారి మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ భర్త మాజీ ప్రధాని రాజీవ్ మరణాంతరం పార్టీని తన భుజస్కందాలపై వేసుకొని తిరిగి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వీరవనిత సోనియా గాంధీ అని, ఆమె ఎంతో కష్టంతో పార్టీని అధికారంలో తీసుకువచ్చి, ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా, తను గాని తన కుమారుడు రాహుల్ గాంధీని, గాని దూరంగా ఉంచి ప్రధానమంత్రిగా ఆనాడు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని, ప్రధానమంత్రిగా చేసి దేశాన్ని ముందుకు నడిపించిన వీర వనిత త్యాగమూర్తి, ఏ పదవీ కాంక్షలేనీ రాజకీయ మహిళా మహా నాయకురాలుగా ఖ్యాతి గడిచిందని, భవిష్యత్తులో ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలను మెండుగా ప్రసాదించాలని, ఆమె అనుభవంతో కాంగ్రెస్ పార్టీకి ఈ భారత దేశానికి, సంక్షేమ అభివృద్ధి పాలనకై ఆమె తగు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పాసిపెంట చిన్నస్వామి, అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ఒలేసి బాబురావు, శెట్టి భగత్ రాం, తెల్ల గంజి సోమేశ్వరరావు, గొల్లోరి పద్మ, తడవారికి భీమారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App