TRINETHRAM NEWS

Congress party INTUC works for the rights, welfare and future of Singareni workers

GDK 2 ఇంక్లైన్ గేట్ మీటింగ్ లో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం ఏరియా-1 జీడికే 2 ఇంక్లైన్ మైన్ గేట్ మీటింగ్ INTUC వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానందం గ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది..

ఈ గేట్ మీటింగ్ కి ముఖ్యఅతిథిగా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి పాల్గొనడం జరిగింది

అనంతరం ముఖ్య అతిథి ధర్మపురి కార్మికుల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది

సింగరేణిలో INTUC సెక్రెటరీ జనరల్ ప్రసాద్ నాయకత్వంలో కార్మిక వర్గానికి ఎన్నికల అప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు అన్ని నెరవేర్చడం జరుగుతుందని..

AITUC యూనియన్ కి కార్మికుల మీద ప్రేమ లేదని వారికి కేవలం అధికారం కోసమే తాపత్రయపడుతున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి సింగరేణికి మంచి రోజులు వచ్చాయని అందులో భాగంగా జనక్ ప్రసాద్ సారధ్యంలో ఈరోజు నైనీ బ్లాక్ మరియు తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ప్రభుత్వం తో మాట్లాడి సింగరేణి భవిష్యత్తును మరింత పెంచారు అన్నారు

సింగరేణి కార్మికులకు సొంతింటి పథకంపై ప్రణాళికలు రచిస్తున్నామని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళాము దానికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది

సింగరేణి కార్మికులకు రావలసిన లాభాల వాటానీ ప్రభుత్వంతో మాట్లాడి సెప్టెంబర్ నెలలో ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది
సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్ పార్టీ మరి INTUC యూనియన్ పూర్తిస్థాయిలో వ్యతిరేకించి ప్రైవేటీకరణ అడ్డుకుందని అన్నారు

రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు జనక్ ప్రసాద్ C&MD తో మాట్లాడి రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేయించారని త్వరలోనే వైద్య సేవలు అందుబాటులో రానున్నాయని అన్నారు

AITUC బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎవరు భయపడొద్దు కార్మిక వర్గానికి కష్టకాలంలో మరి ఎల్లవేళలా INTUC మీ తరఫున ఉండి కొట్లాడుతుందని అండగా ఉంటుందని కార్మికుల కోసం పనిచేసే INTUC యూనియన్ కి మద్దతుగా నిలవాలని కోరడం జరిగింది

ఈ కార్యక్రమంలో,సెంట్రల్ సెక్రటరీలు,B. పోషయ్య, గడ్డం కృష్ణ, పెంచాల తిరుపతి , బ్రాంచి కార్యదర్శులు గుండెటి శ్రీనివాస్,B. జగన్ మోహన్,N. సాగర్,U. నాగరాజు,A. శ్రీనివాస్,B. అన్వేష్ కో ఆర్డినేటర్,B. సాయికుమార్ స్పోక్స్ పర్సన్, ఓవర్మెన్లు సమ్మయ్య,సత్యనారాయణ,L.ఆంజనేయులు,T.ఆంజనేయులు, పిట్ సెక్రటరీ సిరిపురం నరసయ్య.
నాయకులు వెంకటరామిరెడ్డి, రహీం,k. వెంకట్ స్వామి,A. హరీష్, కుమార స్వామి,B. సారంగపాణి,ఎండ్ . జమీర్,MD. ఖదీర్ పాషా, అశోక్,క.నారాయణ, రాజ్ కుమార్, మహేందర్, బొట్టు నరేష్, రవి, రాహుల్, రఘు తదితరులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడము జరిగింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party INTUC works for the rights, welfare and future of Singareni workers