TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విస్మరిస్తోంది: కడియం శ్రీహరి 

ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 

హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు 

అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు: కడియం శ్రీహరి

ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని మాట మార్చారు 

అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు

ప్రతి క్వింటాల్‌కు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారు 

ఇచ్చిన హామీలను ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోంది