TRINETHRAM NEWS

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్

గుండాల దాడి చేయడం సిగ్గుచేటు దాడిని ఖండించిన

రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదిసినందుకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడి చేయడం సిగ్గుచేటని దాడిని తీవ్రంగా ఖండింస్తున్నమని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.
గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులా.. కేసులా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయలను బ్రస్టు పట్టిస్తున్నరన్నారు. రైతులకు కెసిఆర్ ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందించాలని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతారా అని, కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించడం సమంజసమా కాదన్నారు.

కాంగ్రెస్ గుండాలు సుంకే రవి ఇంటిపై దాడి చేసినప్పుడు ఆయన ఇంట్లో లేకపోవడంతో దాడి నుండి తప్పించుకోగలిగారన్నారు బిఆర్ఎస్ పార్టీ నేతలది కేసులకు, బెదిరిపులకు భయపడే తత్వం కాదని, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పై ఇంటిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు ఖండించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు దాడికి ప్రోత్సహించిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మారుతి,కుమ్మరి శ్రీనివాస్,అచ్చే వేణు,నీరటి శ్రీనివాస్, రాకం దామోదర్, తిమోతి, జక్కుల తిరుపతి నీరటీ శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావన్ కిరన్ జీ వెంకన్న కర్రి ఓదేలు ఆవునూరి వెంకటేష్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App