ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 12 at 14.33.11

TRINETHRAM NEWS

పాలకుర్తి మండలం గుంటూరు పల్లిలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

రైతు కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

వడ్లు కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తాం..

సన్నడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్..

యాసంగికి అనురాధ కార్తెలో నార్లు పోయాలి..

పాలకుర్తి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రైతుల కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండలం గుంటూరుపల్లి మంగళవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ
ధాన్యంలో ఎలాంటి కటింగ్ లేకుండా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని రైతులు భరోసాగా ఉండాలని తెలిపారు. దళారుల చేతిలో మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, వాటిని రైతుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతి గింజ సన్న వడ్లకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నిబంధనలు మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబోయాలని సూచించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం ఉంటే వేరువేరుగా ఉంచాలని మిలర్లతో మాట్లాడి సపరేటుగా మద్దతు ధరకు కొనుగోలు చేయించే భాధ్యత నాదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తెలో నార్లు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికి వస్తుందని అన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. 1010, 64, 118 రకాల యాసంగికి అనుకూలమన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజా పాలనలో రైతులకు మేలు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమాల్లో గ్రామ సమాఖ్య సంఘం నిర్వహులు, మాజీ సర్పంచు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page