
పెద్దపల్లి, ఏప్రిల్ – 04// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ట్విన్స్ డెలీవరి ఆపరేషన్ వంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎం సి హెచ్) లో వరుసగా అరుదైన శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నాయని, రెండు రోజుల క్రితం క్రిటికల్ కేర్ ఆపరేషన్ చేయగా, తాజాగా గురువారం రాత్రి మరో ట్విన్స్ డెలివరీ ఆపరేషన్ ను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు
పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన అరికిళ్ల మేఘన గర్భిణిగా ఎం సి హెచ్ లో ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసుకుని మొదటి కాన్పు కోసం బుధవారం పెద్దపల్లి ఎంసిహెచ్ లో చేరిందని, గర్భంలో ట్విన్స్ ఉండటంతో వైద్యులు పాపల ఊపిరితిత్తుల పరిణతి కోసం చికిత్సను అందించారు
గురువారం సాయంత్రం నుంచి మేఘనకు పెయిన్స్ రావడంతో అప్రమత్తమైన వైద్య బృందం ఆమె డెలివరీ కోసం ఏర్పాట్లు చేశారు. గర్భంలో ట్విన్స్ ఉండటంతో రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక జాగ్రత్తలతో ఆమెకు ప్రసవం చేశారు. దీంతో మేఘనకు సుఖ ప్రసవం జరిగి ఒక మగ పాప ,ఆడ పాప కు జన్మనిచ్చింది. చిన్నారులకు పిల్లల డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి తల్లి ఒడిలోకి చేర్చారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించిన వైద్యులు డా. ప్రియాంక, డా. కృష్ణవేణి, డా. సంధ్య లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డి సి హెచ్ ఎస్ కొండ శ్రీధర్ లు ప్రత్యేకంగా అభినందించారు
జిల్లా ప్రజలు హై రిస్క్ క్రిటికల్ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని డిసిహెచ్ఎస్ శ్రీధర్ కోరారు. జిల్లా ఆసుపత్రిలో, ఎం సి హెచ్ లో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రతి గర్భిణీకి 2డి ఈకో తో పాటుగా ప్రతి ఆర్గాన్ ని పరీక్షించే టిఫా స్కాన్లను అందుబాటులో కి తీసుకు వచ్చామని, అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
