
మురమండ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం
అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల…
త్రినేత్రం న్యూస్ : కడియం. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడిపోయేలా వ్యవస్థలను నాశనం చేసిందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు మురమండ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా వార్డు సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎర్రం శెట్టి వీరబాబును ఉపసర్పంచ్ ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. సభ్యులందరూ కలిసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని, గ్రామంలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
కూటమి ప్రభుత్వం గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో అధునాతన విధానాలతో ముందుకెళుతున్నారని అన్నారు. ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన గ్రామ పార్టీ నాయకులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ వెలుగుబంటి ప్రసాద్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, దేవళ్ల రాంబాబు, వట్టికూటి దత్తుడు, నల్లూరి రామకృష్ణ, వార్డు సభ్యులు ముత్యాల రాంబాబు, మడగల చిన్నమ్మలు, బూర శ్రీనివాస్, మిద్దె వీర వేణి, మపాటి నాగరాజు, ఏలూరి దుర్గాప్రసాద్, కొసిరెడ్డి నూక రత్నం తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
