ఆర్జీ వన్ లో ఏఐటియుసి మెంబర్ షిప్ కోసం కార్మికుల చే సంతకాల సేకరణ ప్రారంభం.
ప్రతి కార్మికుడు మెంబర్ షిప్ చేయాలి.
ఏఐటియుసి ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కార్మిక వర్గం సహకరించాలి.
జిడికే వన్ ఇంక్లైన్ లో మెంబర్ షిప్ ను ప్రారంభించిన ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లా గౌడ్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి లో ఏడవ సారి జరిగిన ఎన్నికల్లో ఏఐటియుసి ని గెలిపించి గుర్తింపు సంఘం గా కార్మికులు ఆదరించినప్పటికిని, సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కార్మిక వర్గం యూనియన్ కు మెంబర్ షిప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లా గౌడ్ పేర్కొన్నారు. శనివారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ లో ఏఐటియుసి మెంబర్ షిప్ కోసం కార్మికుల చే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లో ఏఐటియుసి గెలిచిన పది నెలల తర్వాత యాజమాన్యం గుర్తింపు పత్రం ఏఐటియుసి కి ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గుర్తింపు పత్రం తీసుకున్న తర్వాత కార్మకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యం కు లేఖ రాసిన మీదట యాజమాన్యం నవంబర్ 28 న కొత్తగూడెంలో స్ట్రక్చర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అన్నారు .
ఇందులో కార్మికుల ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడం జరిగిందని ఆయన అన్నారు. కార్మిక వర్గ సంక్షేమం కోసం వారి హక్కుల కోసం, సంస్థ అభివృద్ధికోసం పోరాడుతున్న ఏఐటియుసి ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కార్మికులు మెంబర్ షిప్ సంతకాల సేకరణలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్మిక వర్గం ఇచ్చిన చందాలతో, మెంబర్ షిప్ తోనే యూనియన్ కార్యాలయాలు నిర్వహణా కొనసాగుతోందని, కార్యాలయాల్లో పని చేస్తున్న ఆఫీస్ సిబ్బంది కి, హోల్ టైమర్లకు జీతాలు, అలవెన్సులు ఇవ్వాల్సి ఉంటుందని, సమావేశాల్లో పాల్గొనే నాయకులకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇతర ఆఫీస్ ఖర్చులు అధికంగా ఉంటాయని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు రంగు శ్రీను, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి, కలవేణి రాజేశ్, నేరెళ్ళ తిరుపతి, కొప్పుల లింగయ్య, పెరుమాండ్ల రమేశ్, సంపత్ రావు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App