మరో మూడు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత!
ఏపిలో చలి కాలం తీవ్రత పెరగనుంది. గత ఐదు రోజులుగా చలి తీవ్రత రాత్రి – ఉదయం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పొడి గాలుల తీవ్రత పెరగడం వలన చలి తీవ్రత పెరగనుంది.
మరో మూడు రోజులు రాష్ట్రంలోని చాలా భాగాల్లో 13 నుంచి 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండనుంది.
విశాఖలో చలి 18 డిగ్రీలు ఉంటుంది. విజయవాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది.
రాయలసీమలో మాత్రం కాస్త ఎక్కువ తీవ్రత ఉంటుంది. అరకు వ్యాలీ లో 6 డిగ్రీల వరకు ఉంటుంది.