Coal miners celebrate Telangana Foundation Day at TBJK office
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ మేరకు టీబీజీక్స్ ఆర్ జీవన్ ఇంచార్జి వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన టీబీజీకేస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేకమంది విద్యార్థుల బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కార్మికులు విరోచితంగా పోరాడారని 35 రోజులు సకలజనుల సమ్మెతో ఢిల్లీ మెడలు వంచారని తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో అనేక ప్రయోజనాలు కార్మికులకు అందించారని పేర్కొన్నారు
తెలంగాణ ఇంక్రిమెంట్ కారుణ్య నియామకాలు తో పాటు అనేక రకాలుగా సింగరేణి ఉద్యోగులు లబ్ది పొందారని పేర్కొన్నారు మళ్లీ నేడు సింగరేణి పరిరక్షణ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క కార్మికుడు సింగరేణి పరిరక్షణకై పాటుపడాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ నాయకులు మాదాసు రామ్మూర్తి చెలుపురి సతీష్ దూట శేషగిరి వాసర్ల జోసెఫ్ పొలాడి శ్రీనివాసరావు ఏం రాజేషం రోడ్డ సంపత్ పులిపాక శంకర్ కొండ్ర ఆంజయ్య సాయి చరణ్ ఉప్పులేటి తిరుపతి దిడ్డి లక్ష్మణ్ కండె ప్రసాద్ కళాధర్ రాజకుమార్ పర్లపల్లి అభిషేక్ మురళి శ్రీశైలం ఆరిఫ్ ప్రదీప్ గోపి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App