
సింగరేణి అధికారుల సమస్యలపై సి& ఎండితో సమావేశమైన అధికారుల సంఘం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి భవన్ హైదరాబాద్ ఆఫీసులో శనివారం C&ఎండ్ ఎన్.బలరాం IRS అధికారుల సంఘం నాయకులు కలిశారు. అధికారుల వేతనాల్లో భాగమైన పెప్ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) 2022-23 సంవత్సరపు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కొరటం జరిగినది. కోల్ ఇండియా సంస్థలో గత సంవత్సరం జూన్ నెలలోనే చెల్లించగా, సింగరేణి అధికారులకు ఇప్పటివరకు చెల్లించక పోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే E8 ఇంటర్వూలు పూర్తి చేయాలని, అధికారుల సమస్యల పరిష్కారానికి పెండింగ్ సమస్యల పట్ల EE సెల్ త్వరితగతంగా స్పందించేలా ఆదేశించాలని c&ఎండ్ కోరారు. ఈ సమావేశంలో యం.డి.సుభాని. ఇ.డి.(కోల్ మువ్మెంట్), సెంట్రల్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మిపతి గౌడ్,సెంట్రల్ జనరల్ సెక్రటరీ పెద్ది నర్సింహులు,సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పోనుగోటి శ్రీనివాస్, అన్ని ఏరియాల ప్రెసిడెంట్స్,సెక్రెటరీ, వైస్ ప్రెసిడెంట్స్,జాయింట్ సీక్రెటరీ, ట్రెజరర్స్, కో అప్షన్ మెంబర్స్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
