TRINETHRAM NEWS

ప్రైవేట్ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ లు వద్దు ప్రభుత్వమే ముద్దు -వైద్యమిత్రాల శాంతియుత నిరసన… కాకినాడ, మార్చి,24: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మిత్రా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో సోమవారం ఉదయం డిఎంహెచ్వో కార్యాలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వనచర్ల వీరభద్రరావు ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి బంగారు, ఈ నిరసనకు మద్దతు గా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు.

బంగారు శ్రీ ఈ విధంగా మాట్లాడుతూ జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఫీల్డ్ ఉద్యోగులమైన మేము సుమారు 17 సంవత్సరాలుగా ఆరోగ్య మిత్రలుగా పని చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలని శాంతియుత నిరసన తెలియజేస్తున్నామని, సీఎం మీకు దండాలు పెడతాం పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచండి సార్ అని మోకాళ్లు వేసి చేతులు పైకెత్తి దండాలు పెట్టి నిరసన తెలియచేస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించమని, కనీస వేతనాలు 35 వేల రూపాయలు మంజూరు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలని, అనారోగ్యం కారణంగా, యాక్సిడెంట్ గా మృతి చెందిన వారికి 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ప్రైవేట్ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ లు వద్దు ప్రభుత్వమే ముద్దు అంటూ మా మిత్రులను ప్రభుత్వంలోనే కొనసాగించాలని ప్రభుత్వమే మాకు జీతాలు మంజూరు చేయాలని ఆరోగ్య మిత్రాల సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలని ఆమె అన్నారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్రాలకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే రాయితీలన్నీ వారికి అమలు చేయాలని, సుమారు 17 సంవత్సరాల నుండి వైద్య మిత్రులు పనిచేస్తున్నారని, వారి సర్వీస్ స్కేల్ ని బట్టి జీతభత్యాలు పెంపుదల చేయాలని, వారిని తక్షణమే క్రమబద్ధీకరించాలని, వారి శాంతియుత నిరసన ప్రభుత్వం గుర్తించాలని, వారి సహనాన్ని పరీక్షించొద్దని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారిని చర్చలకు పిలిచి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రసాదన్నారు, ఈ శాంతియుత నిరసన లో డిసి కి వినతిపత్రం అందజేశారని, అనంతరం జిల్లా కలెక్టర్,కి వినతిపత్రం అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిరుదు వీరబాబు, ఎండి కాజా మొహిద్దిన్, ఏ దుర్గాప్రసాద్, తులసీదేవి, కే సత్యవతి, యామిని కృష్ణ, అనిల్ కుమార్ తదితరులు ఉమ్మడి జిల్లా వ్యాప్త మిత్రులు అధిక స్థాయిలోపాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Sir, we will