
1.3.2025. మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ మంచిన శెట్టి ప్రసన్న కుమార్ (35) కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26కేజీ ల బియ్యం రెండు వేల అయిదువందల నగదు అందజేసి సహకరించిం ది. సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు చేతుల మీదుగా అందించారు.
రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు (నానాజీ) ద్వారా సి ఎం సహాయనిధికి ప్రోఫార్మా దాఖలు చేసిన దృష్ట్యా ఇప్పటికే 8లక్షల రూపాయల వైద్యాన్ని ప్రయివేటుగా చెల్లించి పొందారని మరో రెండు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి వున్నందున సి ఎం కార్యాలయం నుండి సహాయ నిధి సహకారం 10లక్షలు సకాలంలో కల్పిస్తే వీరి వెతలు తీరతాయన్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ గ్రీవెన్స్ వెళ్ళే అవకాశం లేనందున వచ్చే వారం గ్రీవెన్స్ కి వెళ్లాలని సూచించారు.
జిల్లా మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్న దృష్ట్యా ఇతని కుటుంబ కష్టాలు తెలుసుకుని సి ఎం సహాయ నిధి త్వరగా అందించే సహాయం చేయాలన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ఇతని కుటుంబానికి పోషణ సహాయం అందించా లని కోరారు. ఎటువంటి పని చేసే శక్తి లేక భార్య ఆసరాతో ఇద్దరు అమ్మాయిలతో ఆవేదన చెందుతున్న అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. వివేకా అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
