TRINETHRAM NEWS

ఫార్మా సిటీ, మెట్రో మీద యూ టర్న్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం.

ఎయిర్‌పోర్ట్‌కు దూరాన్ని తగ్గిస్తాం. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు.

నాగోల్‌ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మెట్రోలైన్‌కు లింక్‌ చేస్తాం.

మియాపూర్‌ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో.

అవసరమైతే హైటెక్‌ సిటీ వరకున్న మెట్రోను ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం.

గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం దానికంటే మా ప్రతిపాదనకే తక్కువ ఖర్చు అవుతుంది – సీఎం రేవంత్‌ రెడ్డి.