TRINETHRAM NEWS

CM Revanth Reddy thanked MLA Raj Thakur for helping in setting up the power plant

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సీఎంను కలిసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు

త్వరగా తన ప్లాంటు నిర్మాణం చేయాలని కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం నియోజకవర్గం ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేసిన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

హైదరాబాద్ నేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూతపడే దశకు చేరుకున్న 62. 5 మెగావట్ల బి- థర్మల్ పవర్ ప్లాంట్ స్థానంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్థానికులలో ఉపాధి ఆశలు మొదలయ్యాయి.

ఈ మేరకు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.ప్లాంట్ ఏర్పాటు విషయంలో గత కొంతకాలం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకురావడంతో గత నెల 31న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పలువురు నేతలు ప్లాంటును సందర్శించారు. పాత ప్లాంటు స్థానంలో 1* 800 మెగావాట్ల నూతన ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా ప్లాంట్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై డైరెక్టర్లు, ఇంజనీర్లు పాల్గొని ప్లాంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో రానున్న రోజుల్లో కొత్త పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక అడుగు పడినట్లు అయింది. దీంతో పవర్ ప్లాంట్ కు సంబంధించి అన్ని రకాల వనరులు స్థలం, నీరు, బొగ్గు, రవాణా తదితరుల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. జెన్ కో ఆధ్వర్యంలో కానీ సింగరేణి సారథ్యంలో గాని పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

వీలైనంత త్వరగా పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్యే సీఎంను కోరారు. ప్లాంటు ఏర్పాటు వల్ల భవిష్యత్తులో స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. అంతే కాకుండా పారిశ్రామికంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

రామగుండం లో ఉన్న సింగరేణి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో అదనపు విభాగాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కలసి కోరిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండంలో ఉన్న సింగరేణి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో అదనపు విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలిసి కోరారు. మెడికల్ కాలేజ్ లో మరిన్ని సకల సదుపాయాలతో పాటు నర్సింగ్ కాలేజ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని కోరారు.

తద్వారా హెల్త్ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఇక్కడున్న పారిశ్రామిక కాలుష్యం నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధునాతన సౌకర్యాలతో వైద్య సదుపాయం అందిస్తే కార్మిక కర్షక కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy thanked MLA Raj Thakur for helping in setting up the power plant