TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు అయోమయానికి గురయ్యారు. అనంతరం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలుసుకుని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మరో లిఫ్ట్‌లో ముఖ్యమంత్రిని అధికారులు తరలించారు.

సీఎల్పీ సమావేశం సందర్భంగా నోవాటెల్ హోటల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌లు, కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికి హోటల్ లోపలికి తీసుకెళ్లారు. అయితే పైఅంతస్తుకు వెళ్లే క్రమంలో 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డితోపాటు 13 మంది ఎక్కారు. దీంతో లిఫ్ట్ ఉండాల్సిన స్థానం కంటే కిందికి కుంగిపోయింది. వెంటనే అలారం మోగడంతో అధికారులు, హోటల్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన లిఫ్ట్ వద్దకు పరుగులు పెట్టారు. అనంతరం సీఎం సహా అందరినీ లిఫ్ట్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం మరో లిఫ్ట్‌లో సమావేశం జరుగుతున్న సెకండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఎమ్మెల్యేలు, అధికారులు, హోటల్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy narrowly avoided