TRINETHRAM NEWS

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్:డిసెంబర్ 20
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు.

సచివాలయంలో జరిగే ఈ భేటీకి కలెక్టర్లు అందరూ హాజరుకావాలని రెవన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.

రేపు సాయంత్రం నాలుగు గంటలకుఈ సమావేశం ప్రారంభం,కానుంది.సిఎంగా బాధ్య తలు చేపట్టాక కలె క్టర్లతో తొలిసారి సమావేశం అవుతున్నారు.

ధరణి సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు, పరి పాలన అంశాలు, కీలక సమస్యలపై కలెక్టర్లతో రేవంత్ రెడ్డి చర్చించ నున్నారు.

క్షేత్రస్థాయి సమస్యలు, పరిష్కారమార్గాలపై సమీక్షించనున్నారు.