TRINETHRAM NEWS

గ్రూపు-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..!!

Trinethram News : పెద్దపల్లి : గ్రూప్-4లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రూపు-4 అభ్యర్థులు 8084 మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు.
పదేళ్లలో ఇవ్వని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఇచ్చిందని తెలిపారు. పదేళ్లు మీరు చేశారో..? పది నెలలు మేము ఏం చేశామో చర్చకు రమ్మంటే రారు అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఉద్యోగాలు, ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత పదేళ్లు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ఏడాది కాలంలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. పదేళ్లు మోసం చేసిన వారే.. పది నెలల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. 25లక్షల మందికి రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని అయ్యానంటే.. మీ అందరి అభిమానంతోనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App