TRINETHRAM NEWS

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ..

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు..

ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బయలుదేరి ప్రత్యేక విమానంలో 9:50 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 10.30 గంటలకు చింతపల్లి మండలం చౌడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ఆయన దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చౌడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చేరుకోనున్నారు..