రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సిఎం చంద్రబాబు వరుస భేటీలు
Trinethram News : Delhi : నేడు అర్థరాత్రి 12.30 గంటలకు దావోస్ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సిఎం చంద్రబాబు.
శుక్రవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులను కలుసుకోనున్నారు.
కేంద్ర ఆర్ధిక, వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులను కలవనున్నారు.
ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.
మధ్యాహ్నం 12గంటలకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు.
వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ తరవాత విజయవాడ బయలుదేరుతారు.
సమయం ఇస్తే.. పునరుత్పాధక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిసే అవకాశం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App