TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అరకువేలి ఏప్రిల్ 6: అరకువేలి, మండలం యండపల్లివలస గ్రామం యండపల్లివలసలోని నవజీవన్ ట్రస్టు ఆవరణలో గురువారం రోజున 150 మంది చిన్నారులకు బట్టల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఐ.టి.డి.యస్. సొసైటీ మరియు అరకువేలి మండల జేఏసీ కన్వీనర్ సమర్డి.గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమానికి హైకోర్టు లాయర్ అనుముల వంశీకృష్ణ , స్పాన్సర్‌గా ముందుకొచ్చారు. చిన్నారుల చిరునవ్వులకు బాటలు వేస్తూ,వారికి అవసరమైన బట్టలను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరకువేలి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హిమగిరి,సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాలరావు, హాజరై, స్వయంగా పిల్లలకు బట్టలు అందించి, కార్యక్రమాన్ని మరింత గౌరవాన్నిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “అలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మార్పుకు నాంది పలుకుతాయి. పిల్లలు సంతోషంగా జీవించేందుకు అందరం కలసి కృషి చేయాలి” అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ, కో-కన్వీనర్ లోక్కోయ్. మహాదేవ్, కీల్లో ఆనంద్, వంతాల కామేశ్, సాగర బాబురావు, పూజారి రాంనశ్వరారావు, కీల్లో రాంచందర్, తదితర జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు, ట్రస్టు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూస్తూ అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Clothes distribution program for