ప్రచారంలో స్పష్టంగా గమనించా : ఎంపీ పురందేశ్వరి
ఢిల్లీ ఎన్నికల్లో బిజిపికి సానుకూల వాతావరణం
Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు చాందినీ చౌక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని షకుర్ బస్తీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థి కర్నైల్ సింగ్ జీ, బిజెపి నాయకులతో కలిసి ప్రచారం చేశారు.
బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కన్పిస్తోందని అన్నారు. తప్పకుండా బిజెపి విజయం సాధిస్తుందని ఎంపీ పురందేశ్వరి ధీమా వ్యక్తంచేసారు. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో ఆమె ప్రచారం చేసారు. మరోపక్క పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App