TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 4: అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకువేలి ఎమ్.ఈ. ఓ ఆఫీస్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు శానిటేషన్ కార్మికుల ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ మాట్లాడుతు, మధ్యాహ్న భోజన కార్మికులకు శానిటేషన్ వర్కర్ ల కు కనీస వేతనం 26000/- ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు ఒకటో తేదికి అందించాలి,వంట చేయడానికి గ్యాస్ సిలెండరు, వంట సరుకులు, ప్రభుత్వమే అందించాలి.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వంట సామాన్లు బిల్లులు పెంచాలి.కార్మికులకు పీ.ఎఫ్, ఈ ఎస్.ఐ సదుపాయాలు కల్పించాలి అని అన్నారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం ఎమ్.ఈ.ఓ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల సెక్రటరీ గత్తుం బుజ్జి బాబు, మధ్యాహ్న భోజన కార్మికులు పి.దామోదర్, జె రాము,జి చిట్టి, జె సుమిత్ర ,పి లక్ష్మి, టి మంగ్లీ, పి.పార్వతమ్మ కార్మికులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU demands minimum wages