TRINETHRAM NEWS

Trinethram News : దెందులూరు,మార్చ్21: తెల్లారితే మనవరాలి పెళ్లి పెట్టుకుని సంతోషంగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట జరిగిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దెందులూరు మండలం సీతంపేట పంచాయితీ సింగవరంకు చెందిన నారాయణపురం.రమణమ్మ అనే వృద్ధురాలి ఇంటిలో బుధవారం రాత్రి వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెల్లారితే జరగనున్న తన మనవరాలి పెళ్లి కోసం దాచిన డబ్బు, పెళ్లి బట్టలు,ఇంట్లోని నిత్యావసర వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి పదివేల వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు పలు గృహ అవసర సామాగ్రిని అందచేశారు.
అనంతరం నూతన వధువును ఆశీర్వదిస్తూ పెళ్లి కానుకను అందచేశారు..ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చింతమనేనికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చలమలశెట్టి లక్ష్మి కుమార్(రమణయ్య), క్లస్టర్ ఇంచార్జీ పరశా వెంకట రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పర్వతనేని రామకృష్ణ, గ్రామ పార్టీ సెక్రటరీ బాలిన హరికృష్ణ, మురిపాక శ్రీనివాస్, చల్లారి మద్ది రామయ్య, సరిగే నాగబాబు, షేక్ బాజి, వెలివెల శివ, లావేటి రమణ, బూర్ల రాము సహా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు..