TRINETHRAM NEWS

57వ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న చీఫ్ వీఫ్ పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
జిల్లా లో గ్రంథాలయాలను ఉపయోగించుకొని విజ్జ్ఞాన వంతులు కావాలని తెలంగాణా రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారము గ్రంథాలయ చైర్మెన్ అధ్వర్యంలో పట్టణం లోని అంబేద్కర్భవనము నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోని 17 గ్రంథాలయాలలో 3 లక్షల పదివేల పుస్తకాలు ఉన్నాయని, పుస్తక పఠనం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, గ్రంథాలయ పుస్తకాలు చదవడం వలన కొత్త విషయాలు తెలుస్తాయని, ఉన్నత స్తానానికిచేరుకోవడానికితోడ్పడతాయని అన్నారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో అధ్యయనం చేసిన ఎంతోమంది మేధావులుగా పెద్ద ఉద్యోగస్తులుగా ఎదిగారన్నారు.
వికారాబాద్ జిల్లా గ్రంథాలయం ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో కుడా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నదని అన్నారు ఉపాధ్యాయులు గ్రంథాలయాలను విద్యార్థులు సందర్శించడం, పుస్తక పఠనం పైన అవగాహన కల్పించి వారు అలవాటు పడేలా చూడాలన్నారు.. జిల్లా లో ప్రతి మండలంలో గ్రంథాలయం ఏర్పాటు చేసుకునే అవసరమున్నదని, జిల్లాలోని అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి నిధులను సమకూరుస్తామని, మండలాలలో గ్రంథాలయాల ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర శాసన సభ్యులతో కలిసి మావంతు కృషి చేస్తామన్నారు. న్ర్యుత్య ప్రదర్శన చేసిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేసారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రాజేష్ రెడ్డి. లైబ్రరి సెక్రటరీ సురేష్ బాబు , సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App