ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పేదింటికి వరం.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
దేవరకొండ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే అధికారిక షాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 149 మంది బాధితులకు మంజూరైన 52, 53, 500 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వైద్య చికిత్సల కోసం లేదా అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం అవసరమైన సందర్భాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న సహాయాన్ని వారు విశేషంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ దొంతినేని వెంకటేశ్వరరావు, సింగ జోగి పోషాలు, పోలం లక్ష్మణ్, బాధ మౌని శ్రీనివాస్ గౌడ్, మాద మోని రాములు, ఆంబోతు తేజు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App