
Trinethram News : రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఎక్కడికక్కడ కోళ్లు కుప్పలు తెప్పలుగా మృతి చెందుతున్నాయి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బర్డ్ ఫ్లూ సోకి దాదాపు ఐదున్నర లక్షల కోళ్లు చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలోనూ వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి.
ఎక్కడైనా కోళ్లు అనారోగ్యంతో మరణిస్తే వెంటనే సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9100797300 విడుదల చేశారు. చనిపోయిన కోళ్లను అడ్డగోలుగా పడేయకుండా సురక్షితంగా పూడ్చిపెట్టాలని అధికారులు సూచించారు.
వీటన్నింటి దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. ధరలు కూడా పాతాలానికి పడిపోయాయి. బర్డ్ ప్లూ భయంతో అసలు చికెన్ కొనేవారే కరువయ్యారు.
దీంతో ఈ రోజు ఆదివారం అయినప్పటికీ చికెన్ మార్కెట్లన్నీ ఖాళీగా వెలవెలబోతుంది. 300 పలికిన చికెన్ ప్రస్తుతం రూ.150కి చేరింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్ కు వచ్చే కోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
దీంతో మాంసం ప్రియులు కాస్త ధర ఎక్కువైనా మటన్ వైపు పరుగులు తీస్తున్నారు. మరికొందరు చేపలు, రొయ్యల కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో ఈ రోజు ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలలాడుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
