
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 19 : భారత జాతి వీరత్వానికి ప్రతీక, భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, యువతరానికి తరతరాలకు పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శ్రీ సంత్ రవిదాస్ మందిర్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిధిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ హాజరై శివాజీ మహరాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం మోచి సంగం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని యువనేత చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్, అరుణ, రాజుగౌడ్, ప్రకాష్, కె.నర్సింగ్, వెంకట్, నారాయణ్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
