Trinethram News : అమరావతి: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోదీకి (Narendra Modi) తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు..
తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. ”22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు..
₹10వేల కోట్ల మేర పంట నష్టం ఉంటుందని అంచనా. దాదాపు 770 కి.మీ మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయింది. తుపాను నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలి” అని మోదీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు..