చంద్రబాబు ఆ సీటు నాకు ఇవ్వండి ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉంది

TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. తనకు అక్కనుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు..

బీసీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాకు సీటు ఇస్తారని నమ్మకం ఉందని తెలిపారు..

ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందని బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. యువకులంతా వైసీపీకి పాడి కట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే WWF పెడతారని సంచలన వ్యాఖ్యలుచేశారు. మూడేళ్ళ క్రితమే కొడాలి నాని కేసినో, అస్లీల డ్యాన్సులు అడ్డు ఆడేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిన పిచ్చికుక్క అన్నారు.
టీడీపీ సస్పెండ్ చేస్తే వైసీపీలోకి వెళ్ళాడని తెలిపారు. చంద్రబాబు గానీ, టీడీపీ గానీ తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. గాంధీభవన్ దగ్గర టీడీపీ జెండాలు కనపడితే చంద్రబాబు కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఎవరైనా చంద్రబాబును విమర్శిస్తే ఇకపై జగన్ ను విమర్శిస్తాం మని హెచ్చరించారు..

పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సీఎం దే అని కీలక వ్యాఖ్యలు చేశారు..

You cannot copy content of this page

Scroll to Top