WhatsApp Image 2024 03 14 at 21.23.01
Trinethram News : Mar 14, 2024,
జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలు
సిఐఎస్ఎఫ్ కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జగిత్యాల జిల్లాకు గురువారం చేరుకున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా ఈ బలగాలు పని చేస్తాయి. ఈ సందర్బంగా కేంద్ర బలగాల అధికారులు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ను పోలీస్ ప్రధాన కార్యాలయంలో కలిసి పూల మొక్కను అందజేశారు.
