శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్..!
శాంసంగ్ (Samsung) స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది.
ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది.
కాబట్టి వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్ ఇన్ (CERT-In) సూచించింది.